![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో.. కృష్ణకి మురారి చీర తీసుకొని వచ్చి.. ఇది కట్టుకొని ఎయిర్ పోర్ట్ కి రా అని చెప్పగానే కృష్ణ బాధపడుతుంది. నేను అక్కడకి వెళ్లినాక నువ్వు గుర్తుకు వస్తే వీడియో కాల్ చేస్తానని మురారి అంటాడు. ఆ తర్వాత మురారి తనని వదిలి పెట్టి అమెరికా వెళ్తున్నందుకు కృష్ణ చాలా బాధపడుతుంది.
మరొకవైపు ముకుందని రేవతి పిలిచి మాట్లాడుతుంది. నువ్వు మురారితో అమెరికా వెళ్తున్నావ్ కదా అని రేవతి అనగానే.. " నేను మురారి" మీ నోటి నుండి పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అని ముకుంద అంటుంది. ఇక ముకుంద ఓవర్ యాక్షన్ చూడలేకపోతాడు మధు. నువ్వు అమెరికా వెళ్లి మళ్ళీ వస్తవా అని రేవతి అనగానే.. నా ప్లాన్ కరెక్ట్ గెస్ చేశారని ముకుంద అనుకొని రానని మాత్రం ఇప్పుడు చెప్పనని ముకుంద అనుకుంటుంది. మిమ్మల్ని నమ్మడం ఆపేసిన తర్వాత నుండి నన్ను నమ్మడం మొదలు పెట్టిందని ముకుంద చెప్తుంది. ఇక కృష్ణ, మురారి కలవరని ముకుంద అంటుండగా.. మురారి వచ్చి కృష్ణ కలవదు అంటున్నావ్. కృష్ణ మన కృష్ణ నేనా అని మురారి అడుగుతాడు. మన కృష్ణనే అని మధు చెప్తాడు. అవును మన కృష్ణనే అని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత కృష్ణకి చీర కొనుక్కొని వచ్చిన విషయం మురారి చెప్పగానే.. రేవతి మధు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ముకుంద మాత్రం బాధతో ఉంటుంది.
మరుసటి రోజు ఉదయం మురారి తీసుకొని వచ్చిన చీర కట్టుకొని మురిసిపోతుంది కృష్ణ. అప్పుడే మురారి వస్తాడు. మీరు కాఫీ కోసం వచ్చారు కాదా అని కృష్ణ అనగానే.. కాఫీ అనేది సెకండ్ మిమ్మల్ని చూడడానికి వచ్చానని మురారి అంటాడు. మీకు నేను ఎప్పుడు గుర్తుకు వస్తానో అని కృష్ణ అనుకుంటుంది. మరొక వైపు మధు, రేవతి ఇద్దరు కృష్ణ మురారీల గురించి మాట్లాడుకుంటారు. మురారి ముకుందలని అమెరికా పంపించే కంటే ముందే.. కృష్ణ, మురారీలని ఎక్కడికైనా పంపించేద్దాం. మళ్ళీ పెళ్లి చేసుకొని వస్తారని మధు అంటాడు. అప్పుడే భవాని వచ్చి.. మధు చెంప చెల్లుమనిపిస్తుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకున్న రేవతి, మధులకి భవాని క్లాస్ తీసుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |